The Desk … Nandigama : వెల్నెస్‌ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

The Desk … Nandigama : వెల్నెస్‌ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ మండలం : ది డెస్క్ :

డోర్ టు డోర్ కార్యక్రమం

దేశభక్తి చాటుతూ – హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ :

➖ ఎమ్మెల్యే సౌమ్య

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం రాఘవాపురంలో రూ.36 లక్షలతో నిర్మించిన నూతన విలేజ్‌ వెల్నెస్‌ హెల్త్‌ సెంటర్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

గ్రామీణ ప్రజలు చిన్నపాటి అనారోగ్యానికి సైతం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వెల్నెస్‌ హెల్త్‌ సెంటర్లు ఎంతో ప్రయోజనకరమన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజల ముంగిట కూటమి పాలన.. అభివృద్ధిలో వేగం :

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాఘవాపురంలో కూటమి నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే…నియోజకవర్గంలో రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు.

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజల అవసరాలు, సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని సౌమ్య తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

దేశభక్తి చాటుతూ.. సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకెళ్తూ :

స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాఘవాపురంలో బుధవారం నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబట్టి గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తి, జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కూటమి శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటాయని సౌమ్య తెలిపారు. ర్యాలీలో మహిళలు, యువత, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.