🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
తరలివచ్చిన వేలాది మహిళలు
2 వేల కిలోల స్వీట్లతో సారె
ఆషాఢ మాసం సందర్భంగా.. శనివారం మహిళా భక్తులు పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భీమవరంతో పాటు విజయవాడ, గుంటూరు, మార్కాపురం, హనుమాన్‌జంక్షన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు బృందాలుగా తరలివచ్చారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, బొండాడవారి వీధి, పెదఅమిరం తదితర ప్రాంతాల నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. సుమారు 2,000 కిలోల స్వీట్లతో సారె సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.

