🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఆగస్టు నాటికి రోడ్లు, డ్రైన్ల సమస్యలకు పరిష్కారం
డోర్ టు డోర్ – 18 డివిజన్ లో..
అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి తెలిపారు. స్థానిక 18వ డివిజన్‌లో శనివారం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
పెన్షన్ల సమస్యను పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అర్హులందరికీ న్యాయం చేస్తుందని, వచ్చే ఆగస్టు నాటికి నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైన్ల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు.

