The Desk … Eluru : పేదలకు ఉచిత వైద్యం.. దాతల చేయూత

The Desk … Eluru : పేదలకు ఉచిత వైద్యం.. దాతల చేయూత

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచిత వైద్య సేవలు, మందులు అందించడమే లక్ష్యంగా ప్రతి గురువారం ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.

ఈ వారం నిర్వహించిన శిబిరాన్ని పరిశీలించిన ఆయన…వైద్య సేవల కోసం వచ్చిన వారికి భరోసా కల్పించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సేవా కార్యక్రమాన్ని గుర్తించి లయన్స్‌ క్లబ్‌ సభ్యుడు వేమా రాము నెల రోజులకు సరిపడా మందులను దాతృత్వంతో అందించారని ఎమ్మెల్యే తెలిపారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి సహకరించాలని ఆయన కోరారు.