The Desk … Eluru : జూట్‌ మిల్లు కార్మికులకు నిరుద్యోగ భృతి విడుదల చేయాలి

The Desk … Eluru : జూట్‌ మిల్లు కార్మికులకు నిరుద్యోగ భృతి విడుదల చేయాలి

🟡 డిల్లీ/ఏలూరు: : ది డెస్క్ :

లోక్‌సభలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ ప్రస్తావన

ఏలూరులో మూతపడిన శ్రీకృష్ణ జూట్‌మిల్లు, కొత్తూరులోని కృష్ణ హెసియన్స్‌ యూనిట్‌కు చెందిన సుమారు 4,000 మంది కార్మికుల సమస్యను ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ బుధవారం లోక్‌సభలో ప్రస్తావించారు. రూల్‌ 377 కింద మాట్లాడిన ఆయన.. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు అటల్‌ బీమిత్‌ వ్యక్తి కళ్యాణ్‌ యోజన (ABVKY) కింద నిరుద్యోగ భృతి అందించాలని కోరారు.

శ్రీకృష్ణ జూట్‌మిల్లు 2022 మార్చి 3న మూతపడగా, కార్మికులను కొత్తూరు యూనిట్‌కు బదిలీ చేశారు. అనంతరం ఆ యూనిట్‌ కూడా మూతపడటంతో 2023 జూన్‌ 22న తుది పరిష్కార ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు కొత్తూరు మిల్లుకు చెందిన 200 మంది కార్మికులు మాత్రమే నిరుద్యోగ భృతి పొందారని, మిగిలిన అర్హులైన కార్మికుల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని ఎంపీ తెలిపారు.

ప్రత్యేక కేసుగా పరిగణించి, పరిష్కార ఒప్పంద తేదీని ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన ఏలూరు కార్మికులకు నిరుద్యోగ భృతి త్వరితగతిన అందేలా ఈఎస్‌ఐ అధికారులను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.