🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మకు శనివారం మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. భీమవరం, పరిసర గ్రామాల నుంచి సుమారు 2 వేల మంది మహిళలు పాల్గొని అమ్మవారికి మిఠాయిలు, పండ్లు, చలివిడి తదితర నైవేద్యాలను సమర్పించారు. వెయ్యి కిలోలకు పైగా ప్రసాదాలను సమర్పించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. అనంతరం సుమారు 1,500 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమానికి విశేషంగా సహకరించిన మహిళా సేవకులు మద్దాల విజయలక్ష్మి, కొప్పర్తి దేవి ఆదిలక్ష్మిలను దేవస్థానం సత్కరించింది. ధర్మకర్తలు, ట్రస్టు సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

