The Desk…ప్రజలతో కమీషనర్ ‘ముఖాముఖీ’ కార్యక్రమం

The Desk…ప్రజలతో కమీషనర్ ‘ముఖాముఖీ’ కార్యక్రమం

🔴 కడప జిల్లా : ప్రొద్దుటూరు : ది డెస్క్ :

సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం జరగనున్న “ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ” కార్యక్రమం యధావిధిగా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుందని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. అనంతరం రెగ్యులర్ PGRS కార్యక్రమం జరుగుతుందని ప్రజలందరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కమీషనర్ సూచించారు.

ఫిర్యాదు దారులు తమ సమస్యలను ఈ 9247563385/ 9849905863 ఫోన్ నంబర్స్ కు చెప్పవచ్చని, ప్రతి ఫిర్యాదును అధికారికంగా నమోదు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖాముఖీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం కూడా మున్సిపాలిటీ సేవలను ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లడం, దివ్యాంగులు, వయో వృద్దులు, మహిళలు, చదువుకుంటున్న విద్యార్థులు, ఆరోగ్యం సహకరించలేనివారు, ఈకార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే నమోదైన ప్రతి సమస్యను నిబంధనల ప్రకారం టైం లైన్’ లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమీషనర్ తెలిపారు.

ముఖాముఖీ కార్యక్రమానికి
మున్సిపల్ కమీషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్, శానిటేషన్ సూపర్ వైజర్, మున్సిపల్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రెవిన్యూ ఆఫీసర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, మెప్మా సెక్షన్ హెడ్ తదితర అధికారులతో పాటు PGRS సెక్షన్ సిబ్బంది హాజరు అవుతారని కమీషనర్ శ్రీనివాస్ విశ్వనాధ్ అన్నారు

భవదీయులు
తూతిక శ్రీనివాస విశ్వనాధ్, MBA, LLM, (మాజీ సైనికుడు) కమీషనర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, 26.07.2026, 7675924666