The Desk … Proddutur : ▪️పింఛన్‌కు పచ్చజెండా▪️రూ.6.70 కోట్లు విడుదల

The Desk … Proddutur : ▪️పింఛన్‌కు పచ్చజెండా▪️రూ.6.70 కోట్లు విడుదల

🔴 కడప జిల్లా : ప్రొద్దుటూరు : ది డెస్క్ :

ఆగస్టు నెలకు 14,134 మంది లబ్ధిదారులకు నగదు పంపిణీ
➖తూతిక శ్రీనివాస విశ్వనాథ్ (కమీషనర్)

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.6.70 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం 14,134 మంది లబ్ధిదారులకు ఈ నిధులతో ఇంటి వద్దే పింఛన్ అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.

సందర్భంగా వార్డు సచివాలయ సిబ్బందితో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కమిషనర్ మాట్లాడుతూ :

పింఛన్ పంపిణీని గౌరవప్రదంగా నిర్వహించాలని, లబ్ధిదారుల నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నగదు అందించాలని, ప్రతి వార్డులో స్వయంగా పర్యటిస్తూ పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తానని కమిషనర్ వెల్లడించారు.