The Desk … Vunguturu : ▪️నాణ్యతకు పెద్దపీట▪️నాణ్యతతోనే పనులు పూర్తి చేయాలి➖ఎంపీడీవో మనోజ్

The Desk … Vunguturu : ▪️నాణ్యతకు పెద్దపీట▪️నాణ్యతతోనే పనులు పూర్తి చేయాలి➖ఎంపీడీవో మనోజ్

🟡 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్

సీసీ రోడ్లు, డ్రైన్ల పనులపై ఎంపీడీవో తనిఖీ

రూ.40 లక్షల సీసీ డ్రైన్ పనుల పరిశీలన

ఉంగుటూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులను ఎంపీడీవో జి.ఆర్. మనోజ్ గురువారం పరిశీలించారు. ఉంగుటూరు మార్కెట్ సమీపంలోని కాల్వగట్టు రోడ్డులో రూ.40 లక్షల జిల్లా పరిషత్ నిధులతో చేపడుతున్న సీసీ డ్రైన్ నిర్మాణాన్ని తనిఖీ చేసి పనుల పురోగతిని సమీక్షించారు.

అదేవిధంగా కైకరం, నారాయణపురం, చేబ్రోలు, గోపినాధపట్నం, రాచూరు గ్రామాల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.