🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెo : ది డెస్క్ :

పట్టణంలోని ఎస్వీఆర్ విగ్రహం సమీపంలో నిర్మించిన ఆధునిక ఫుడ్ కోర్ట్ పనులను పురపాలక సంఘం కమిషనర్ ఎం. యేసుబాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :.
పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆహార సేవలు అందించేందుకు ఆధునిక ఫుడ్ కోర్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే జీవి మాల్ సమీపంలో ప్రతిష్ఠించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ లైటింగ్, ఫౌంటెన్ తదితర సౌకర్యాలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఫుడ్ కోర్ట్‌తో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఈనెల 25న ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Arrangements Completed for Inauguration of Food Court and Chhatrapati Shivaji Maharaj Statue
Municipal Commissioner M. Yesubabu on Tuesday inspected the newly constructed modern Food Court located near the SVR Statue in the town. During the visit, he reviewed the facilities provided at the Food Court and examined the sanitation standards, while issuing several instructions to the concerned officials.
Speaking on the occasion, Commissioner Yesubabu said :
The modern Food Court has been established to provide the residents of the town with quality food services in a clean, hygienic, and pleasant environment. He further stated that lighting, fountains, and other amenities have been completed around the Chhatrapati Shivaji Maharaj Statue installed near GV Mall.
The Commissioner announced that both the Food Court and the Chhatrapati Shivaji Maharaj Statue will be opened to the public on June 25. He appealed to the residents of the town to participate in large numbers and make the inauguration ceremony a grand success.

