🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
వినతులు స్వీకరించి అధికారులకు ఆదేశాలు
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
➖ ఎమ్మెల్యే చంటి
అన్నివర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే బడేటి చంటి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి వినతులను స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని బాధితులకు భరోసా కల్పించారు.
అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
బడేటి చంటి ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Resolving Public Grievances is the Goal
Petitions Received and Directions Issued to Officials
Welfare of All Sections is the Government’s Objective
– MLA Badeti Chanti
Eluru MLA Badeti Chanti stated that the welfare of all sections of society is the primary objective of the coalition government. He emphasized that special priority is being given to the resolution of public grievances.
On Monday, while being available to the public at his camp office in Eluru, the MLA warmly interacted with people who had come from various areas and received their petitions. He carefully listened to their concerns, understood the issues in detail, and assured the affected individuals of the government’s support.
Subsequently, he directed the concerned officials to take immediate action to resolve the issues brought to his attention. He stated that a special action plan is being implemented with the objective of providing permanent solutions to the problems faced by people across the constituency.
The public expressed their appreciation for Badeti Chanti’s direct interaction with citizens, his efforts to understand their problems firsthand, and the steps being taken to ensure their timely resolution.

