🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఛత్రపతి శివాజీ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ :.
యోగా భారతీయ సంస్కృతికి గొప్ప వారసత్వమని, ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు.
కమిషనర్ ఎం. యేసుబాబు మాట్లాడుతూ :
యోగా ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకర జీవనానికి దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ప్రజలు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, యోగాభ్యాసకులు పాల్గొని సామూహిక యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం నిర్వహించారు. RDO ఎం. సూర్యరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

International Yoga Day Celebrated Grandly
The 12th International Yoga Day celebrations were organized on a grand scale on Sunday at Chhatrapati Shivaji Center under the auspices of the Tadepalligudem Municipality. MLA Bolisetti Srinivas attended the event as the chief guest and participated in various yoga practices.
Speaking on the occasion, MLA Bolisetti Srinivas said :
Yoga is a priceless heritage of Indian culture. He stated that practicing yoga regularly helps improve both physical and mental well-being and contributes to a healthier lifestyle.
Municipal Commissioner M. Yesubabu said :
Yoga helps reduce stress and promotes healthy living. He emphasized the importance of incorporating yoga into daily life for overall wellness.
More than 500 participants, including citizens, government officials, municipal staff, students, and yoga practitioners, took part in the event. They performed group yoga sessions, Surya Namaskars, Pranayama, and meditation.
Several officials, including RDO M. Surya Rao, were also present at the programme.

