The Desk… Eluru : యోగా విశ్వవ్యాప్త గౌరవం భారతీయతకు గర్వకారణం

The Desk… Eluru : యోగా విశ్వవ్యాప్త గౌరవం భారతీయతకు గర్వకారణం

ఏలూరు జిల్లా: ఏలూరు : ది డెస్క్ :

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ వెట్రిసెల్వి

భారతీయ ఆధ్యాత్మిక సంపద అయిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా వట్లూరు టిటిడిసి కేంద్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తదితరులు యోగా ఆసనాలు నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ :

యోగా ఆరోగ్యానికి దివ్యౌషధమని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికి యోగా చేరాలి
ఆరోగ్యవంతమైన సమాజమే ప్రభుత్వాల లక్ష్యం
➖ఎమ్మెల్యే చంటి

యోగా ద్వారా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

గతంలో విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

యోగా దైనందిన జీవితంలో భాగం కావాలి :
యువత యోగాతో ఉన్నత శిఖరాలకు చేరాలి : ఎస్పీ ప్రతాప్ శివకిషోర్

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరిగి యువత ఉన్నత లక్ష్యాలను సాధించగలరని తెలిపారు.

యోగాంధ్ర విజయవంతం చేసిన అధికారులకు సన్మానం :

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 23 మందికి ప్రశంసాపత్రాలు :

జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులను కలెక్టర్, ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు. యోగా అంశాలపై నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన 23 మందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.