The Desk … Eluru : ▪️@అక్షర స్కూల్▪️

The Desk … Eluru : ▪️@అక్షర స్కూల్▪️

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరులోనే తొలిసారి స్కూల్ స్థాయిలో సివిల్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం

ఇండియన్ ఎడ్యుకేషన్ సమిట్‌లో నేషనల్ అవార్డు గుర్తింపు

ఉచిత డిజిటల్ బోధనతో చిన్నతనం నుంచే IAS, IPSపై అవగాహన
➖అర్చనా చౌదరి(కరస్పాండెంట్)

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చిన్నతనం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని, తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు ఫీజులు, ఒత్తిడి లేకుండా క్లాస్‌రూంలోనే ఉచితంగా IAS, IPSపై అవగాహన కల్పించడమే తమ ధ్యేయమని అక్షర స్కూల్ కరస్పాండెంట్ అర్చనా చౌదరి మీడియాకు తెలిపారు.

సందర్భంగా అర్చనా చౌదరి మాట్లాడుతూ :

స్కూల్ చైర్మన్ జవ్వాజి సురేంద్ర కుమార్ నేతృత్వంలో.. విద్యార్థుల కలను సాకారం చేసేందుకు సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. సమాజంలో అత్యున్నత స్థానాలైన IAS, IPS అధికారులు ప్రజలకు చేసే సేవలపై విద్యార్థులకు చిన్న వయసు నుంచే పూర్తి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

డిజిటల్ + ప్రాక్టికల్ బోధన :

కేవలం పుస్తక పరిజ్ఞానికే పరిమితం కాకుండా ప్రతి అంశాన్ని విద్యార్థులకు డిజిటల్ రూపంలో, ప్రత్యక్షంగా బోధిస్తున్నామని కరస్పాండెంట్ తెలిపారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.

జిల్లాలోనే ఫస్ట్ :

ప్రస్తుతం చాలా పాఠశాలలు ఒలింపియాడ్, IIT కోర్సులు నడుపుతున్నాయని, కానీ స్కూల్ స్థాయిలోనే సివిల్ సర్వీస్ అవేర్‌నెస్ కార్యక్రమాలను ఉచితంగా ప్రవేశపెట్టిన ఏకైక పాఠశాల తమ ‘అక్షర స్కూల్’ మాత్రమేనని ఆమె గర్వంగా ప్రకటించారు. ఏలూరు జిల్లాలోనే ఈ తరహా అవగాహన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తామే ప్రారంభించామని వెల్లడించారు.

నేషనల్ అవార్డు :

విద్యార్థులను ఉన్నత అధికారులుగా తీర్చిద్దే లక్ష్యంతో తీసుకున్న ప్రత్యేక చొరవకు గుర్తింపుగా ఈ నెల 4వ తేదీన చెన్నైలో జరిగిన ఇండియన్ ఎడ్యుకేషన్ సమిట్‌లో నేషనల్ అవార్డు స్కూల్ యాజమాన్యానికి దక్కిందని, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడమే అక్షర స్కూల్ మేనేజ్‌మెంట్ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ ఇన్చార్జి కిరణ్, ఇన్చార్జి లలిత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

First-Ever Civil Services Awareness Program at School Level in Eluru

National Award Recognition at the Indian Education Summit

Free Digital Learning to Create Awareness About IAS and IPS Careers from an Early Age
➖Archana Chowdary (Correspondent)

In today’s highly competitive world, students need to set clear goals from an early age. With this vision, Akshara School is creating awareness about prestigious civil services such as IAS and IPS within the classroom itself, without imposing any additional fees or burden on parents, said Archana Chowdary, Correspondent of Akshara School, while addressing the media.

Speaking on the occasion, Archana Chowdary said :

Under the leadership of School Chairman Javvaji Surendra Kumar, the institution has introduced an innovative educational approach aimed at helping students achieve their dreams. She explained that the school is providing students with comprehensive awareness from a young age about the role and public service responsibilities of top civil servants such as IAS and IPS officers.

Digital and Practical Learning
The Correspondent stated that the school is not limiting education to textbook knowledge alone. Instead, every subject is taught through a combination of digital tools and practical learning experiences. This approach, she said, helps nurture creativity, leadership qualities, and critical thinking among students.

A First in the District :

While many schools currently offer Olympiad and IIT-oriented programs, Akshara School is the only institution to introduce a Civil Services Awareness Program at the school level completely free of cost. She proudly noted that Akshara School is the first educational institution in Eluru district to launch such an initiative.

National Award Recognition :

She further informed that the school management received a National Award at the Indian Education Summit held in Chennai on the 4th of this month, in recognition of its special efforts to inspire and prepare students for higher administrative services. She emphasized that the primary objective of Akshara School’s management is to create opportunities and lay a strong foundation for students’ future success.

The program was attended by School In-charge Kiran, In-charge Lalitha, and the parents of students.