The Desk… Eluru : అభివృద్ధిపై రాజీ లేదు..రహదారుల నిర్మాణమే ప్రాధాన్యం ➖ఎమ్మెల్యే బడేటి చంటి

The Desk… Eluru : అభివృద్ధిపై రాజీ లేదు..రహదారుల నిర్మాణమే ప్రాధాన్యం ➖ఎమ్మెల్యే బడేటి చంటి

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :1

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి రాజీ ఉండదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నగరంలోని 19వ డివిజన్ గ్రీన్‌సిటీలో రూ.1.18 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రహదారి పనులను ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించిన ఎమ్మెల్యే, స్థానికుల సమస్యలను తెలుసుకుని ఖాళీ స్థలాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. 15 రోజుల్లోగా స్థలాలను శుభ్రం చేయాలని, లేనిపక్షంలో కార్పొరేషన్ ద్వారా పనులు చేపట్టి ఖర్చును యజమానుల నుంచే వసూలు చేస్తామని హెచ్చరించారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో దశలవారీగా రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన :

సేవలకు చిరునామాగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం’ : బడేటి చంటి

ఇదే రోజు పవర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. రెడ్‌క్రాస్ సమన్వయంతో నిర్వహించిన ఈ శిబిరంలో వివిధ ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందజేశారు.
ఏలూరు నియోజకవర్గాన్ని సేవలకు చిరునామాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం సంతృప్తినిస్తోందని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.

No Compromise on Development

Road Infrastructure Remains the Top Priority

➖ MLA Badeti Chanti

District TDP President and Eluru MLA Badeti Chanti stated that there will be no compromise when it comes to the development of the Eluru Assembly Constituency. Along with RTC Vijayawada Zone-2 Chairman Reddy Appala Naidu, he inspected the ongoing construction of a CC road being built at a cost of ₹1.18 crore in Green City, Ward No. 19 of Eluru city.

The MLA instructed officials and the contractor to strictly adhere to quality standards in the execution of the works. He also interacted with local residents to understand their concerns and emphasized the need to maintain cleanliness in vacant plots. He directed that such sites be cleaned within 15 days, warning that if owners fail to do so, the Municipal Corporation will undertake the work and recover the expenses from the respective property owners.

Speaking on the occasion, MLA Chanti said :

Road development works are being taken up in a phased manner across all parts of the constituency, and the government’s objective is to provide better infrastructure and essential civic amenities to the people.

Free Medical Camp Receives Excellent Response

“Eluru Assembly Constituency is Becoming a Hub of Public Service” – Badeti Chanti

Later in the day, the MLA inspected a free medical camp organized at his camp office in Powerpet. Conducted in coordination with the Red Cross, the camp provided free medical check-ups and medicines to people from various localities.

MLA Badeti Chanti said that the medical camps are being organized with the aim of transforming the Eluru Assembly Constituency into a model center for public service. He expressed satisfaction that free healthcare services are reaching and benefiting the people.

  1. ↩︎