The Desk … Kaikaluru : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

The Desk … Kaikaluru : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కైకలూరు నియోజకవర్గం, కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో శాసనమండలి సభ్యుడు జయమంగళ వెంకటరమణ మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జయమంగళ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని భావితరాలకు స్వచ్ఛమైన గాలి, కాలుష్యరహిత హరిత వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.