🟡 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : చల్ల చింతలపూడి : ది డెస్క్ న్యూస్ :
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి
➖మోతుకూరి నరసింహ శోభన్ బాబు (నాని)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సుఖసంతోషాలతో, స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని చల్ల చింతలపూడి ఎంపీటీసీ అభ్యర్థి మోతుకూరి నరసింహ శోభన్ బాబు (నాని) తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం, కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోత్సాహంతో ప్రాంతీయంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళుతున్నామని వివరించారు.
గత ప్రభుత్వంలో కక్షపూరిత రాజకీయం, పక్షపాతం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుత కూటమి పాలనలో అలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ పనులు చేసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
చల్ల చింతలపూడి ఎంపీటీసీ స్థానంలో పోటీ చేస్తున్న తను 400 నుంచి 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అలాగే రామారావుగూడెం – శ్రీరామవరం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోతుకూరి గంగారత్నంను కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రానున్న రోజుల్లోనూ రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుందని, ప్రజలందరూ కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని నాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Development and Welfare Must Remain the Top Priority
➖Nani
Calls for a landslide victory for alliance candidates:
Motukuri Narasimha Shobhan Babu (Nani), MPTC candidate from Challa Chintalapudi in Denduluru constituency, has appealed to voters to extend their overwhelming support to the Telugu Desam Party (TDP) and alliance candidates in the forthcoming local body elections, stating that development and public welfare should remain the foremost priorities.
Speaking to the media, Nani said that since the alliance government assumed office in Andhra Pradesh, people had been experiencing a more peaceful and favourable atmosphere. He attributed the state’s development momentum to the leadership of Chief Minister N. Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan and Minister Nara Lokesh.
He further stated that several development and welfare initiatives were being taken to the grassroots level with the encouragement and support of local MLA Chintamaneni Prabhakar.
Referring to the previous government, Nani alleged that vindictive politics and discriminatory practices had caused considerable hardship to the public. In contrast, he said, the present alliance government was providing an environment in which people could access public services without political discrimination.
Expressing confidence in his electoral prospects, Nani predicted that he would secure a victory with a majority of 400 to 500 votes in the Challa Chintalapudi MPTC constituency.
He also appealed to voters to ensure a decisive victory for Motukuri Gangaratnam, the alliance MPTC candidate contesting from the Ramaraogudem–Sriramavaram constituency.
Nani expressed confidence that stable governance and development-oriented administration would continue in the state and urged voters to strengthen the hands of the alliance candidates in the local elections.

