🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
మూడు ముళ్లకు ముందే శక్తి టీమ్ ఎంట్రీ
బాల్యానికి పెళ్లి బంధం వద్దు
చదువుకు బదులు పెళ్లా..?
బాలికల భవిష్యత్తుపై పోలీసుల అవగాహన
అడ్డుకున్న పోలీసులు
బాల్య వివాహాల నిరోధంలో ఏలూరు జిల్లా పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన శక్తి టీమ్ సభ్యులు ఆర్ఆర్ పేట పాములదిబ్బలో జరుగుతున్న బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించి వివాహాన్ని నిలిపివేశారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ :
బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై పడే ప్రభావాలను గురించి వివరించి, బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, బాలికలకు విద్య అందించి వారి లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలని, బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

