The Desk …Bhimavaram : భీమవరంలో టీడీపీ ‘డోర్ టు డోర్’ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు

The Desk …Bhimavaram : భీమవరంలో టీడీపీ ‘డోర్ టు డోర్’ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు

ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కేబీసీ చైర్మన్ ఘంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో బుధవారం ‘డోర్ టు డోర్’ (ఇంటింటికీ టీడీపీ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వార్డుల్లో పర్యటించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆరా తీసిన కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్)వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.

కార్యక్రమంలో షాబీనా బేగం, యలమంచిలి శ్రీనివాస్, ఖలీల్, రబ్బానీ, పడమటి వెంకటేశ్వరరావు, ఫిరోజ్, హైమావతి, సత్య, పుత్రయ్య, రావూరి కృష్ణ అప్పారావు, గంధం రాధ మరియు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.