🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో.. సేవలకు విశేష స్పందన
పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో ఈ వారం కూడా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి వైద్య సేవలు మరింత నాణ్యంగా అందించాలని వైద్య బృందానికి సూచించారు. శిబిరానికి వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన సేవా స్ఫూర్తితో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మెగా వైద్య శిబిరాలను నిర్వహించి స్పెషలిస్టు వైద్యుల సేవలను కూడా పేదలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Poor People’s Health is Our Priority
Free Medical Camp Every Thursday
Excellent Public Response to the Initiative Led by MLA Badeti Chanti
Free medical camps being conducted under the leadership of Eluru MLA and Telugu Desam Party (TDP) District President Badeti Chanti, with a strong focus on the healthcare of the underprivileged, are receiving an overwhelming response from the public.
As part of the weekly initiative held every Thursday at the MLA Camp Office in Powerpet, Eluru, doctors conducted medical examinations for people who arrived from various parts of the constituency. Patients were provided with free medicines based on their medical needs.
MLA Badeti Chanti visited the camp, reviewed the medical services being provided, and instructed the healthcare team to continue delivering high-quality treatment. He also interacted warmly with the beneficiaries, enquired about their health conditions, and encouraged them.
Speaking on the occasion, MLA Badeti Chanti said :
“In line with the service-oriented vision of Chief Minister N. Chandrababu Naidu, we are conducting free medical camps every week on a regular basis. In the coming days, we plan to organize mega medical camps and make the services of specialist doctors available free of cost to poor and needy people. I urge everyone to make the best use of these free healthcare services.”

