TheDesk… Mudinepalli : బొమ్మినంపాడులో సామూహిక బీజామృత విత్తన శుద్ధి కార్యక్రమం

TheDesk… Mudinepalli : బొమ్మినంపాడులో సామూహిక బీజామృత విత్తన శుద్ధి కార్యక్రమం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని బొమ్మనిపాడు గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో ట్రైనింగు అసోసియేటు (ఎన్ఎఫ్ఏ) డి.మధుబాబు సూచనలు మేరకు సామూహిక బీజామృత విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ICRP డి.అనూష ఆధ్వర్యంలో నంబూరు ఇస్సాకు పొలంలో బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది.

పొలంలో బీజామృతంతో విత్తనాలు శుద్ధి చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు బీజా మృతంతో వరి విత్తన శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రైతు శ్రీ నున్న వీర రాఘవులు వరి విత్తనాలకు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాలను చల్లడం జరిగిందని తెలిపారు. అలాగే రైతు చెన్నంశెట్టి సత్తిపండు రెండు లీటర్ల బీజామృతాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ICRP దేవి శేషవేణి మాట్లాడుతూ.. బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం మరియు భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల ప్రభావం తగ్గడంతో పాటు విత్తనాలు మొలక శాతం మెరుగు పడుతుందని అన్నారు. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి అధిక దిగుబడులకు దోహదపడతాయని వివరించారు. ప్రతి రైతు పంట సాగుకు ముందు తప్పనిసరిగా బీజా మృతంతో విత్తన శుద్ధి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.