🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :

ప్రజల నుంచి వినతుల స్వీకరణ
అధికారులకు తక్షణ చర్యల ఆదేశాలు
మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే
చెత్త సేకరణ ఆటోను ప్రారంభించిన బడేటి చంటి
మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పలు ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. సోమవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. బాధితుల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అనంతరం కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ కోసం దాతల సహకారంతో సమకూర్చిన ఆటోను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

