The Desk… Vunguturu : పదో తరగతికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవాలి

The Desk… Vunguturu : పదో తరగతికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవాలి

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : చేబ్రోలు : ది డెస్క్

మంచి ఫలితాలే లక్ష్యంగా కృషి చేయాలి

విద్యార్థులకు ఎంపీడీవో జీ.ఆర్. మనోజ్ సూచన

ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ఎంపీడీవో జీ ఆర్ మనోజ్ ముచ్చటించారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువును ప్రారంభించాలని ఎంపీడీవో జీ.ఆర్. మనోజ్ సూచించారు. ప్రతి రోజు సమయపాలనతో చదువుతూ, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా అభ్యసిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు.

పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా నిరంతర సాధన, పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, సందేహాలను వెంటనే ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో శ్రమిస్తే ప్రతి విద్యార్థి విజయాన్ని అందుకోవచ్చని ఎంపీడీవో మనోజ్ విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.