The Desk… Tadepalligudem : గ్రేడ్-2 కమిషనర్‌గా రవి సుధాకర్‌కు పదోన్నతి

The Desk… Tadepalligudem : గ్రేడ్-2 కమిషనర్‌గా రవి సుధాకర్‌కు పదోన్నతి

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి బదిలీ

మున్సిపల్ కార్యాలయంలో ఘన వీడ్కోలు

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం మేనేజర్ రవి సుధాకర్ గ్రేడ్-2 కమిషనర్‌గా పదోన్నతి పొంది అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.

సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :

రవి సుధాకర్ మున్సిపాలిటీలో మేనేజర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించి, పరిపాలనలో క్రమశిక్షణ, సిబ్బంది సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. గ్రేడ్-2 కమిషనర్‌గా పదోన్నతి పొందడం అభినందనీయమని, కొత్త బాధ్యతల్లోనూ మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

రవి సుధాకర్ మాట్లాడుతూ :

తాడేపల్లిగూడెంలో పనిచేసిన కాలం తనకు చిరస్మరణీయమని, కమిషనర్‌తో పాటు సహోద్యోగుల సహకారమే తన పదోన్నతికి బలమైందని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మున్సిపల్ ఇంజనీర్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు రవి సుధాకర్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.