🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలులో భాగంగా రెవెన్యూ శాఖ గ్రామస్థాయి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించేందుకు ఉంగుటూరు మండలంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు)కు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్వో), మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి ఆర్ మనోజ్ (ఎంపీడీఓ) పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో గ్రామస్థాయి అధికారుల పాత్ర, విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు.
ఎన్నికల సమయంలో నిబంధనల అమలును పర్యవేక్షించడం, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించడం, ఎన్నికల వాతావరణానికి విఘాతం కలగకుండా చూడటంలో అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.

