The Desk … Bhimavaram : లలితా త్రిపురసుందరిగా మావుళ్లమ్మ దర్శనం

The Desk … Bhimavaram : లలితా త్రిపురసుందరిగా మావుళ్లమ్మ దర్శనం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

అమ్మవారి సన్నిధికి రూ.50 వేల విరాళం అందజేసిన బెంగళూరుకు చెందిన భక్తులు

భీమవరం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మావుళ్లమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఏలూరి వినోద్, భక్త కిరణ్మయి అమ్మవారి దేవస్థానానికి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. విరాళం అందించిన దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, మల్లువలస లక్ష్మి, నిర్మల, పాపోలు ఏడుకొండలు తదితరులు దాతలకు శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

ఈ వివరాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వెల్లడించారు.