The Desk … Vunguturu : ▪️గాంధీ బాటలో గ్రామసభలు▪️

The Desk … Vunguturu : ▪️గాంధీ బాటలో గ్రామసభలు▪️

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ న్యూస్ :

మండలంలోని పలు గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉంగుటూరు మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు, ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. గోపాలపురం, రావులపర్రు, అక్కుపల్లి గోకవరం, వెల్లమిల్లి, బాదంపూడి గ్రామాల్లో గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. రావులపర్రులో మొక్కలు నాటారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై గ్రామసభల్లో చర్చించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో, ప్రత్యేక అధికారులు, సచివాలయ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.