🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

మూడు జిల్లా స్థాయి అవార్డులు
విద్యార్థులు, పారిశుధ్య సిబ్బందికి సత్కారం
స్వచ్ఛత హి సేవ–2026లో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మూడు జిల్లా స్థాయి అవార్డులను కైవసం చేసుకుంది. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరుకు భీమవరం త్యాగరాజ భవన్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 4వ వార్డు వీకర్స్ కాలనీ–04కు ఉత్తమ స్వచ్ఛత కాలనీ, ఉత్తమ పారిశుధ్య కార్మికుడు, స్వచ్ఛత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డులు లభించాయి.

మున్సిపల్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు :
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వచ్ఛతపై నిర్వహించిన వ్యాసరచన, డిబేట్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లతో పాటు తన సొంత నిధులతో నగదు బహుమతులు అందజేశారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బందిని సత్కరించారు.
ప్రజల సహకారమే విజయానికి కారణమని కమిషనర్ ఎం. యేసుబాబు తెలిపారు. స్వచ్ఛ తాడేపల్లిగూడెం సాధనకు ప్రజలంతా ఇదే స్ఫూర్తితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

