🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :
పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే సత్కారం
ఉంగుటూరుకు రూ.6.5 కోట్ల అభివృద్ధి
అర్హులందరికీ ఇంటి స్థలాలు
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. ఉంగుటూరులో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ :
నియోజకవర్గంలో, మండలంలో పలు రహదారులను సీసీ, తారు రోడ్లుగా అభివృద్ధి చేశామని, ఒక్క ఉంగుటూరు గ్రామంలోనే 6.5 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
గ్రామంలో నెలకొన్న ఇంటి స్థలాల సమస్య తన దృష్టికి వచ్చిందని, త్వరలో పరిష్కరించి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం పారిశుధ్య సిబ్బందిని శాలువాలతో సత్కరించి ఆరోగ్య కిట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ప్రత్యేక అధికారి, తహసీల్దార్ సన్యాసిరావు అధ్యక్షత వహించగా.. ఎంపీడీవో జి.ఆర్. మనోజ్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శాజానాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాతూర్ విజయకుమార్, అయ్యప్ప శోభారాణి, మధు తదితరులు పాల్గొన్నారు.

