The Desk … Eluru : ఎన్టీఆర్‌ భరోసాతో పేదలకు భరోసా.. అర్హులందరికీ త్వరలో కొత్త పెన్షన్లు ➖ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : ఎన్టీఆర్‌ భరోసాతో పేదలకు భరోసా.. అర్హులందరికీ త్వరలో కొత్త పెన్షన్లు ➖ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లతో పేదలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. గురువారం 29వ డివిజన్‌ కుమ్మరిరేవులో ఆర్టీసీ విజయవాడ జోన్‌–2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు.

పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, బెడ్‌ పేషెంట్లకు సొమ్ము అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుమ్మరిరేవులో డ్రైనేజీ, మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవాదాయ శాఖ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాల అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని, త్వరలో కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని చంటి తెలిపారు.