🔴 ఎన్టీఆర్ జిల్లా : ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ : ది డెస్క్ న్యూస్ :
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి
వితౌట్ హెల్మెట్ – అవుతాది ఆమ్లెట్
రింగ్ సెంటర్లో స్ట్రాంగ్ వార్నింగ్
హెల్మెట్ ధరిస్తేనే.. సురక్షిత ప్రయాణం
హెల్మెట్‌పై అవగాహన
వాహనదారులకు కౌన్సెలింగ్
నిబంధనలు పాటించండి – ప్రమాదాలు నివారించండి
చలాన్ కాదు.. ప్రాణరక్షణే ముఖ్యం
➖K. కృష్ణ (IBM ట్రాఫిక్ సిఐ)
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకత, రోడ్డు భద్రతా నిబంధనలపై ట్రాఫిక్ సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చలానాలు విధించడంతో పాటు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ సిఐ కె కృష్ణ కోరారు.

