🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : కైకరం గ్రామపంచాయతీ :
కైకరం గ్రామపంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో గత కొన్ని సంవత్సరాలుగా మంచినీళ్లు తగిన మోతాదులో లభించక చుట్టూ నీరు ఉన్నప్పుడు కూడా తాగే నీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న రామన్నగూడెం గ్రామ ప్రజలకు తీపి కబురు…అక్కడ ఇటీవల శాసనసభ్యులు ధర్మరాజు చొరవతో జిల్లా పరిషత్ చైర్మన్ ఆ గ్రామానికి బోరువేసే నిమిత్తం 25 లక్షలు నిధులు మంజూరు చేయగా… పంచాయతీ అధికారులు ఆ గ్రామాన్ని పలుమార్లు సందర్శించి పర్యవేక్షణ చేస్తూ..బోర్ వేయించడం జరిగింది. సుమారు 730 అడుగుల లోతులో మంచినీళ్లు పడినట్లు అధికారులు తెలిపారు.
దీంతో రామన్నగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక శాసనసభ్యులు ధర్మరాజుకి, జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల రామన్నగూడెం గ్రామంలో మంచినీటి సమస్యను గ్రామ పెద్దలు స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ ను ఆదేశించారు.
అందులో భాగంగా ఎంపీడీవో సదరు గ్రామాన్ని సందర్శించి అక్కడ సమస్యలను స్వయంగా పరిశీలించి తాత్కాలిక చర్యలో భాగంగా ట్యాంకర్ ద్వారా నీటిని సరిపడా చేయడం ప్రారంభించారు. మరియు హౌసింగ్ కాలనీలో వేసిన బోర్ నుంచి నీటి సరఫరాకి చర్యలు తీసుకున్నారు. మరియు చాలా ఏళ్ల క్రితం వేసిన పైపులైన్ లో ఉన్న సమస్యలను కూడా పంచాయతీ అధికారులు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మంచినీళ్లు పడటంతో గ్రామస్తులు అధికారులు చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

