విశాఖ : ది డెస్క్ :
అంగన్వాడీ పిల్లలకు ఆటబొమ్మలు, స్నాక్స్ పంపిణీ: కిరణ్మయి దంపతుల ఉదారత

జీవీఎంసీ 11వ వార్డు గాంధీనగర్లోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఒక వినూత్న సేవా కార్యక్రమం జరిగింది. సామాజిక బాధ్యతలో భాగంగా ‘సిటిజన్ టైమ్స్’ పత్రికా సంస్థ ఆధ్వర్యంలో, ‘జీవన్ కిరణ్మయి నృత్యాలయం’ నిర్వాహకులు కిరణ్మయి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రంలోని చిన్నారి పిల్లలకు వారి మానసిక వికాసానికి తోడ్పడే ఆటబొమ్మలను, పౌష్టిక ఆహారంతో కూడిన స్నాక్స్ (తినుబండారాలు) పంపిణీ చేశారు తమకు నచ్చిన బొమ్మలు, ఇష్టమైన స్నాక్స్ చేతికి అందడంతో చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పత్రికా రంగంలోనే కాకుండా, ఇలా సామాజిక బాధ్యతతో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ‘సిటిజన్ టైమ్స్’ ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు
దాతలు ముందుకు వస్తే అంగన్వాడీలకు మహర్దశ: కిరణ్మయి
“సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు వస్తు లేదా నిధుల రూపంలో సహాయం అందిస్తే పేద పిల్లలకు మరింత మేలు జరుగుతుంది. ప్రభుత్వ సాయంతో పాటు సమాజ భాగస్వామ్యం కూడా తోడైతేనే అంగన్వాడీ కేంద్రాలు బలోపేతమై, పిల్లల బాల్యం ఆనందంగా సాగుతుంది.” అని కిరణ్మయి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందితో పాటు ‘జీవన్ కిరణ్మయి నృత్యాలయం’ ప్రతినిధులు, ‘సిటిజన్ టైమ్స్’ సీనియర్ రిపోర్టర్ దాసు, లోకేష్, ధర్మ, విష్ణు, మహేష్, దేవా, బన్నీ, శామ్యూల్ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

