The Desk… Tadepalligudem : పార్కులో ఎమ్మెల్యే, కమిషనర్‌ చీపురు పట్టి..

The Desk… Tadepalligudem : పార్కులో ఎమ్మెల్యే, కమిషనర్‌ చీపురు పట్టి..

🟢 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

“స్వచ్ఛత హి సేవ”–2026లో భాగంగా తాడేపల్లిగూడెం 11వ వార్డులోని మున్సిపల్‌ పార్కులో సోమవారం భారీ శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు స్వయంగా చీపుర్లు పట్టి పార్కును శుభ్రం చేశారు.

పార్కులో పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించడంతోపాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.

సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ :

పార్కులు ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదానికి ఎంతో అవసరమని, వాటిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

సందర్భంగా స్పెషల్ గ్రేట్ కమిషనర్ ఏసుబాబు మాట్లాడుతూ :

పట్టణంలోని అన్ని పార్కులను దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.