The Desk … Tadepalligudem : మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు

The Desk … Tadepalligudem : మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : యాగర్లపల్లి :

నేరాల నివారణకు చట్టాల గురించి వివరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఆది ప్రసాద్

తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆది ప్రసాద్ ఆధ్వర్యంలో.. యాగర్లపల్లిలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు, భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళలు, బాలికలు తమపై జరిగే వేధింపులు, నేరాల విషయంలో భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు.