🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్
“నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమం
ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16న ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.
శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వ ప్రాధాన్యతను ప్రతిబింబించేలా “అన్నదాత సుఖీభవ” ప్రధాన అంశంగా సుమారు 5 వేల మంది రైతులతో సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం అక్కడ ఉన్న చిన్నారి క్రీడాకారులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు.

