The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్‌కు రెడ్ క్రాస్ అవార్డు

The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్‌కు రెడ్ క్రాస్ అవార్డు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, వెస్ట్ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి రెడ్ క్రాస్ అవార్డు లభించింది.

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు ఈ అవార్డును అందుకున్నారు. రక్తదానంపై అవగాహన కల్పించడంలో, రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘం చేసిన ఉత్తమ సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ :

“రక్తదానం మహాదానం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు నాయకత్వంలో రక్తదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శం”_ అని ప్రశంసించారు.

మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :

ఈ అవార్డు పురపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రక్తదాతలందరి సమష్టి కృషికి దక్కిన గౌరవమని, రక్తం కొరత లేని జిల్లాగా వెస్ట్ గోదావరిని తీర్చిద్దేందుకు మావంతు మరింత కృషి చేస్తామని” తెలిపారు.

Red Cross Award fora Tadepalligudem Municipal Commissioner

The Tadepalligudem Municipality received the Red Cross Award at a program organized by the Indian Red Cross Society, West Godavari District Branch on the occasion of World Blood Donor Day, observed on June 14.

The award was presented to Tadepalligudem Municipal Commissioner M. Yesubabu by West Godavari District Collector and Magistrate Chadalavada Nagarani. The municipality was recognized for its outstanding efforts in creating awareness about blood donation and organizing blood donation camps.

Speaking on the occasion, District Collector Chadalavada Nagarani said :

“Blood donation is the greatest donation. The efforts being made under the leadership of Tadepalligudem Municipal Commissioner Yesubabu to create awareness about blood donation among the public are highly commendable. Such service-oriented initiatives serve as an inspiration to all municipalities.”

Municipal Commissioner Yesubabu said :

“This award is a recognition of the collective efforts of the municipal staff, secretariat personnel, and all blood donors. We will continue to work diligently towards making West Godavari a district free from blood shortages.”