🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

జనగణన-2027 క్షేత్ర స్థాయి కార్యకలాపాలు శుక్రవారము నుండి పట్టణంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జనగణన నిర్వహణ విధానం, ఇంటింటి సర్వేలో పాటించాల్సిన నియమాలు, డేటా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్ గారు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు నియామక ఉత్తర్వుల ప్రతులు, జనగణన కిట్లు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
జనగణన అనేది దేశాభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు మూలమని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వచ్చే జనగణన సిబ్బందికి ప్రజలంతా పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సరైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరతాయన్నారు.
జనగణన సిబ్బంది విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించకుండా, ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురికాకుండా, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా జనగణన ప్రక్రియలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, జనగణన నోడల్ అధికారి, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
NOTE :
జనగణన-2027 కోసం మీ ఇంటికి వచ్చే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించండి. మీ సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ :
C&D వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్, RRR సెంటర్లను తనిఖీ చేసిన కమిషనర్
స్వచ్ఛ సర్వేక్షణ్-2026లో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు గురువారం సాయంత్రం పట్టణంలోని C&D వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ మరియు RRR సెంటర్లను తనిఖీ చేశారు.
12వ వార్డు సంజీవ్ నగర్ హై స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన C&D వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కమిషనర్ పరిశీలించారు. 1 TPD సామర్థ్యం గల ఈ ప్లాంట్‌లో నిర్మాణ వ్యర్థాలైన మట్టి, స్టీల్, ప్లాస్టిక్స్, ఇటుకలు వేర్వేరుగా విభజించి రీసైక్లింగ్ చేసే విధానాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయకుండా నేరుగా ఈ ప్లాంట్‌కు తరలించాలని ప్రజలకు, కాంట్రాక్టర్లకు సూచించారు.
అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన RRR సెంటర్లను సందర్శించారు. “Reduce, Reuse, Recycle” స్ఫూర్తితో పని చేయని వస్తువులు, పాత పుస్తకాలు, బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అవసరమైన వారికి అందించే ఈ కేంద్రాల పనితీరును కమిషనర్ అభినందించారు. LiFE – Lifestyle for Environment లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలంతా RRR సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రస్థాయిలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి పౌరుడు సహకరించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త వేర్పాటు, C&D వేస్ట్ ప్రాసెసింగ్, RRR కార్యక్రమాలపై ప్రజలు సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో సానుకూలంగా స్పందించి మంచి ర్యాంక్ సాధించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tadepalligudem Gears Up for Census-2027 and Swachh Survekshan
The municipal administration in Tadepalligudem has finalized preparations for the field-level operations of Census-2027, with official house-to-house enumeration set to commence this Friday. Municipal Commissioner M. Yesubabu conducted a comprehensive review meeting with enumerators and supervisors at the municipal office on Thursday to streamline the data collection process.
During the session, the Commissioner provided detailed instructions regarding the operational methodology, the strict protocols for data collection, and the importance of maintaining accuracy during the house-to-house survey. To facilitate the field work, essential kits, appointment orders, and official identification cards were distributed to the designated staff.
Addressing the personnel, Commissioner Yesubabu emphasized that the census is the cornerstone of national development and the effective implementation of welfare schemes. He urged citizens to extend their full cooperation to the visiting enumerators, assuring them that all provided information would be kept strictly confidential. “Accurate data ensures that government benefits reach every eligible individual,” the Commissioner stated. He further advised the public to remain vigilant against misinformation and to participate voluntarily in this national exercise, which is essential for informed policy-making.
In addition to census preparations, the Commissioner inspected the city’s sanitation and waste management facilities as part of the Swachh Survekshan-2026 drive. During his visit to the Construction and Demolition (C&D) waste processing plant located opposite the 12th Ward Sanjeev Nagar High School, he reviewed the facility’s capacity to sort and recycle construction materials like brick, soil, and plastic. He firmly instructed contractors and residents to refrain from dumping construction debris on public roads, urging them to utilize the dedicated processing plant instead.
The inspection also covered the local “Reduce, Reuse, Recycle” (RRR) centers, where the Commissioner commended the collection of old books, clothes, and household items. Aligning with the “Lifestyle for Environment” (LiFE) initiative, he encouraged citizens to utilize these centers to promote sustainable living. Concluding his visit, Commissioner Yesubabu called upon all residents to support the municipality’s efforts to achieve the top spot in the state rankings for Swachh Survekshan, specifically requesting positive public feedback regarding sanitation and waste segregation practices.

