🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ లభించాయని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పారదర్శకంగా, నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ వెంకట రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం, రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, శానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ లు హరీష్, సురేష్, టాప్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు, పురపాలక సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు.

13వ వార్డులో అంబేద్కర్ జయంతి వేడుకలు :
13వ వార్డు శివాలయం రోడ్డులో బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి కమిషనర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
డా. అంబేద్కర్ కలలుగన్న సమాజం కేవలం రిజర్వేషన్లతో కాకుండా, సమానత్వం, విద్య ద్వారానే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, అప్పుడే నిజమైన సమానత్వం వస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశయం కుల, మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమేనని, ఆ దిశగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 13వ వార్డు ప్రజలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కమిషనర్ ఏసుబాబు :
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సమసమాజ స్థాపన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే నేడు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, సమానంగా జీవించగలుగుతున్నామని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

