🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
పట్టణ డీలిమిటేషన్ ప్రక్రియపై తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం అధికారుల సమావేశం నిర్వహించారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వుల మేరకు 48 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీ డీలిమిటేషన్‌పై అధికారులు చర్చించారు.
సమావేశానికి RDO సూర్యారావు హాజరై డీలిమిటేషన్ నిబంధనలు, ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

