The Desk … Vunguturu : కొత్త బోరు కోసం ప్రతిపాదనలు

The Desk … Vunguturu : కొత్త బోరు కోసం ప్రతిపాదనలు

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

ఎర్రమల్లెపాడులో ఎంపీడీవోకు స్థానికుల వినతి

ఎర్రమల్లెపాడులో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని స్థానిక కూటమి నాయకులు, గ్రామస్థులు ఎంపీడీవో జి.ఆర్. మనోజ్‌ను కోరారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛపథం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు సమస్యలను వివరించారు.

ప్రస్తుతం ఉన్న బోరు నుంచి తగినంత నీరు రాకపోవడంతో గ్రామంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. పాఠశాల సమీపంలోని శిథిలావస్థకు చేరిన ఓహెచ్‌ఆర్‌ను తొలగించాలని కోరారు. స్పందించిన ఎంపీడీవో అంచనాలు రూపొందించి ఎమ్మెల్యే, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామని, కొత్త బోరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.