The Desk … Vunguturu : తడి–పొడి చెత్తపై అవగాహన.. వర్మీ ప్రక్రియపై శిక్షణ

The Desk … Vunguturu : తడి–పొడి చెత్తపై అవగాహన.. వర్మీ ప్రక్రియపై శిక్షణ

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ఉంగుటూరు : ది డెస్క్ :

ఉంగుటూరు మండలంలోని పంచాయతీ సిబ్బందికి ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఉంగుటూరు గ్రామంలోని ఎస్‌డబ్ల్యూఎం షెడ్డు వద్ద పంచాయతీ పీడీఓలు, క్లాత్‌ మిత్ర సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు.

అనంతరం సిబ్బంది గ్రామ వీధుల్లో పర్యటించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించడంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. నాడెపు తొట్టెల ద్వారా ఎరువు తయారీ, వర్మీ కంపోస్టింగ్‌ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఆఫీసర్‌ (ఎమ్మార్వో), ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, అన్ని పంచాయతీల పీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.