The Desk … Nuziveedu : కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యం

The Desk … Nuziveedu : కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యం

🟡 ఏలూరు జిల్లా : నూజివీడు : ది డెస్క్ :

స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. నూజివీడు నియోజకవర్గం తెదేపా కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన బుధవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఏలూరు పార్లమెంట్‌ ఎన్నికల పరిశీలకురాలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నియోజకవర్గ పరిశీలకుడు మర్రిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ :

అందరూ ఒక కుటుంబంలా ఐక్యంగా పనిచేసి కూటమి విజయానికి బాటలు వేయాలని సూచించారు. కూటమి తరఫున ఎవరు పోటీ చేసినా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.