The Desk… Krishna : జిల్లాలో 1,769 మంది బీఎల్‌ఓలకు రూ.44.22 లక్షల గౌరవ వేతనం

The Desk… Krishna : జిల్లాలో 1,769 మంది బీఎల్‌ఓలకు రూ.44.22 లక్షల గౌరవ వేతనం

🔴 కృష్ణాజిల్లా : ది డెస్క్ :

బీఎల్‌ఓల ఖాతాల్లోకి గౌరవ వేతనం

బూత్‌ స్థాయి అధికారులకు ఊరట

హర్షం వ్యక్తం చేసిన జంపాన శ్రీనివాసగౌడ్, బేతపూడి జోగేశ్వరరావు.

కృష్ణా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 1,769 మంది బూత్‌ లెవల్‌ అధికారులకు (బీఎల్‌ఓలు) 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో క్వార్టర్‌ గౌరవ వేతనాలుగా రూ.44,22,500 మంజూరయ్యాయి. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్టీఐ కార్యకర్త, సామాజిక సేవకుడు జంపాన శ్రీనివాస గౌడ్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు, G.O.Rt.No.1065, General Administration (Elections-C) Department, తేదీ 26-05-2026 ప్రకారం నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 1,769 మంది బీఎల్‌ఓలకు ఒక్కొక్కరికి నిర్ణీత గౌరవ వేతనం అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి 17-08-2026న పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు లేఖలో వెల్లడించారు.

బీఎల్‌ఓలకు గౌరవ వేతనాల మంజూరుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీఎల్‌ఓలకు సకాలంలో గౌరవ వేతనాలు అందించడం పట్ల బేతపూడి జోగేశ్వరరావు, బి.దుర్గాప్రసాద్, ఎం.సాంబశివరావు, గుంజా హేమలత, బొల్లా శివపార్వతి, శిరివెళ్ల గౌరీ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.