The Desk … Eluru : ▪️జిల్లా అభివృద్ధే లక్ష్యం▪️

The Desk … Eluru : ▪️జిల్లా అభివృద్ధే లక్ష్యం▪️

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం

విద్య, వైద్యం.. తాగు, సాగునీటికి పెద్దపీట

➖ZP చైర్ పర్సన్ నవ్యశ్రీ

ఏలూరు జిల్లా పరిషత్‌ నూతన చైర్‌పర్సన్‌గా చింతమనేని సాయి నవ్యశ్రీ శుక్రవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వైస్‌ చైర్మన్‌గా బొర్రా చలమయ్య ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి పూలబొకేలు అందించి అభినందించారు. నూతన జెడ్పీటీసీలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నవ్యశ్రీ మాట్లాడుతూ :

జిల్లాలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రజలకు సేవల ద్వారా రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.