🔴 పగో జిల్లా : భీమవరం ఆధ్యాత్మికం : ది డెస్క్ న్యూస్ :
భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసం.. అమ్మవారి సేవలో భాగస్వామ్యం కావాలనే సంకల్పం.. వెరసి శ్రీ మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు మరో బంగారు కానుక చేరింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మవారి దేవస్థానంలో చేపట్టిన సంపూర్ణ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామానికి చెందిన ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి వెంకట సత్య ఉమాదేవి దంపతులు నాలుగు గ్రాముల బంగారాన్ని భక్తిశ్రద్ధలతో విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాత దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం దంపతులకు శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.
అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టులో భక్తులు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. భక్తుల విరాళాలు, సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమం ముందుకు సాగుతోందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు.

