🔴 కృష్ణాజిల్లా : గన్నవరం నియోజకవర్గo : ఉంగుటూరు మండలం : మానికొండ : ది డెస్క్ న్యూస్ :
గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న యువకుడికి అవకాశం ఇవ్వండి.
ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీ అందించండి
సమస్యలు తెలిసినవాడికి సర్పంచ్ పీఠం ఇవ్వండి
గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యువకుడు సుధీర్‌కు గ్రామ సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని వైఎస్సార్సీపీ మానికొండ గ్రామ కమిటీ ప్రజలను కోరింది. గ్రామానికి చెందిన వ్యక్తిగా, సామాన్యుల కష్టసుఖాలు తెలిసిన యువకుడిగా సుధీర్‌ను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసింది.
గ్రామంలో మౌలిక
సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణతో పాటు సమగ్ర గ్రామాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది.
పదవి కోసం కాదు.. ప్రజల మధ్య ఉండే నాయకత్వం కోసం :
గ్రామ ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సుధీర్‌కు అవకాశం కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రతి ఇంటి సమస్యను తన సమస్యగా భావించి, గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాల్సిన బాధ్యత యువ నాయకత్వంపై ఉందని పేర్కొంది.
గ్రామానికి కావాల్సింది మాటలు చెప్పే నాయకుడు కాదు.. మార్పు చూపించే నాయకుడు.. అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిగా సుధీర్‌ను ఆదరించాలని గ్రామ కమిటీ కోరింది.
ఈ ఎన్నికల్లో సుధీర్‌ను తమ ఇంటి బిడ్డగా భావించి ఆశీర్వదించాలని, సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించి మానికొండ గ్రామ అభివృద్ధికి సహకరించాలని వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ విజ్ఞప్తి చేసింది.

