The Desk … Eluru : ద్వారకా తిరుమలలో ఎంపీ పుట్టా ప్రత్యేక పూజలు

The Desk … Eluru : ద్వారకా తిరుమలలో ఎంపీ పుట్టా ప్రత్యేక పూజలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు/ ద్వారక తిరుమల : ది డెస్క్ :

ప్రజల సుఖసంతోషాల కోసం స్వామివారికి ప్రార్థనలు

ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బుధవారం ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు, ఏలూరు పార్లమెంట్ పరిధి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు.

ఎంపీ పుట్టాతో మేయర్ అభ్యర్థి భేటీ

నూతన పాలకవర్గం ఏర్పాటుపై చర్చ

ఏలూరు మేయర్ స్థానానికి కూటమి అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన రెడ్డి అప్పలనాయుడు బుధవారం సాయంత్రం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పాటు, తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ రెడ్డి అప్పలనాయుడును అభినందించారు.