🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశాలు
తెలంగాణ నుంచి పెద్దవాగుకు భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. ముంపు గ్రామాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం ఏలూరులోని తన కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, తహసీల్దార్లతో ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు ఆహారం, తాత్కాలిక వసతి కల్పించాలని సూచించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, స్థానిక పార్టీ నాయకులతోనూ పరిస్థితిపై చర్చించారు. అత్యవసర సహాయం కోసం ఏలూరు క్యాంపు కార్యాలయాన్ని 95152 25125, 98855 19299 నంబర్లలో సంప్రదించాలని ఎంపీ కోరారు.

