The Desk … Eluru : ఏలూరులో కూటమి జైత్రయాత్ర

The Desk … Eluru : ఏలూరులో కూటమి జైత్రయాత్ర

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

మూడు డివిజన్లకే వైసీపీ పరిమితం

వైసీపీకి ఏలూరు ఓటర్ల షాక్‌

ఏలూరులో కూటమి హవా…వైసీపీకి ఎదురుదెబ్బ

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘనవిజయం ప్రజల నమ్మకానికి నిదర్శనమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్‌ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. పవర్‌పేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

సమన్వయం, పటిష్ఠమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌తోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. గతంలో టీడీపీకి మూడు డివిజన్లే దక్కగా, ఈసారి వైసీపీని మూడు డివిజన్లకే పరిమితం చేసి ప్రజలు తగిన తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ :

కూటమి రెండున్నరేళ్ల పాలనకు కార్పొరేషన్‌ ఫలితాలు ప్రజామోదాన్ని చాటుతున్నాయని, తన విజయానికి కృషిచేసిన ఎమ్మెల్యే చంటికి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ల గౌరవం పెరిగేలా నగర పాలన సాగిస్తామని, రాష్ట్రంలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కారు అభివృద్ధికి బాటలు వేస్తుందని వెల్లడించారు. విజయానికి సహకరించిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏఎంసీ ఛైర్మన్‌ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, నూతన కార్పొరేటర్లు పాల్గొన్నారు.